తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆలయ చైర్మన్ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మౌలిక సౌకర్యాలు, ప్రసాద వితరణ కౌంటర్లు వంటి కీలక అంశాలపై చర్చించారు. అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఏటా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సత్యదేవుని శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. దేవాలయం సన్నధిలో అన్నదానం నూతన భవన నిర్మాణ నిర్ణయాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి... అన్నవరం దేవస్థానానికి 'ఐఎస్ఓ' గుర్తింపు