రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు మితిమీరుతున్నాయని... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. కాకినాడలో తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని.. అందువల్లే కేసులు పెరిగాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పెద్దాడ జడ్పీటీసీ స్థానానికి దళిత మహిళ భాగ్యలక్ష్మిని తెలుగుదేశం పార్టీ నిలబెడితే నామినేషన్ దాఖలును అడ్డుకోవడానికి వైకాపా నాయకులు ప్రయత్నించారని మండిపడ్డారు. కులధ్రువీకరణ పత్రం జారీలోనూ తహసీల్దార్ జాప్యం చేశారని ఆరోపించారు. తెదేపా నాయకులకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి.. ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా ఆధ్వర్యంలో నిరసన