కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ షేక్ బాషా అన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించి ఇంటివద్దే ఉండాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో ఆయన పర్యటించారు. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే!