రాజధానిపై వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలువురు ఎండగట్టారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని పలువురు నాయకులు, మేథావులు కోరారు. అనంతరం పట్టణం నడిబొడ్డున నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర మాజీ మంత్రులు తెదేపా నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని మాట్లాడారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలని ప్రభుత్వం ముందుకు వెళితే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: