సమాజ అభివృద్ధికి యువత పాత్ర చాలా ముఖ్యమైనదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినయ విధేయతలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరమని...సమాజానికి మనం ఏం చేయగలమో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. సమానత్వ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజిస్ ఛాన్సలర్ ఆచార్య కె.సి. రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజమహేంద్రవరం ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. 11, 12 స్నాతకోత్సవం సందర్భంగా 567 మంది విద్యార్థులకు పట్టాలు, ఎనిమిది మందికి బంగారు పతకాలు, ఆరుగురికి పీహెచ్డీలు గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఇవీ చదవండి...'తండ్రి ఆశయాలకు తనయుడు తూట్లు..!'