పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా... కార్యాలయం ఆవరణలో వేచివున్న దివ్యాంగుడి వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. రావులపాలెం మండలం ఆత్రేయపురానికి చెందిన బాధితుడు తాడిశెట్టి దుర్గారావు.. తన వయసు 70 సంవత్సరాలని తెలిపారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానన్నారు. ఎవరూ లేని అనాథ అయిన కారణంగా.. పింఛన్ కు అవసరమైన ధ్రువపత్రం సమర్పించలేకపోయానని చెప్పారు. ఇప్పటికైనా పింఛన్ ఇప్పించాలని అధికారులను కోరారు. అధికారులతో మాట్లాడి పింఛన్ వచ్చే ఏర్పాటు చేస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
"అయ్యా.. పింఛను ఇప్పించండి" - దివ్యాంగుడు ఆవేదన
పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తనకు 70 సంవత్సరాల వయసున్నా ఇప్పటి వరకూ పింఛన్ రావడం లేదని ఆవేదన వ్వక్తం చేశారు.
పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా... కార్యాలయం ఆవరణలో వేచివున్న దివ్యాంగుడి వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. రావులపాలెం మండలం ఆత్రేయపురానికి చెందిన బాధితుడు తాడిశెట్టి దుర్గారావు.. తన వయసు 70 సంవత్సరాలని తెలిపారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానన్నారు. ఎవరూ లేని అనాథ అయిన కారణంగా.. పింఛన్ కు అవసరమైన ధ్రువపత్రం సమర్పించలేకపోయానని చెప్పారు. ఇప్పటికైనా పింఛన్ ఇప్పించాలని అధికారులను కోరారు. అధికారులతో మాట్లాడి పింఛన్ వచ్చే ఏర్పాటు చేస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
( ) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నారై ప్రభాకర్ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. హోం మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారని..... ఈ కేసులోనూ... అంతే తొందరగా చర్యలు ఉపక్రమించాలని వర్ల రామయ్య కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా తెదేపా హయాంలో అవినీతి జరిగిందంటూ రోజుకో ప్రకటన చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శించారు.
Body:bite
Conclusion:వర్ల రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ