గొలుసుల చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా దొంగలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 28 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అమలాపురం ప్రాంతానికి నలుగురు యువకులు పాత స్నేహితులు. వీరందరి వయసు 21 ఏళ్లు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు... చోరీల బాట పట్టారు. బంగారు గొలుసులు, ద్విచక్ర వాహనాలను కలిసి దొంగిలించారు. వీరిపై తూర్పు గోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరిజిల్లాలో 8, తెలంగాణలో ఒక కేసు నమోదు అయింది. నిందితులు శనివారం ఉదయం పోలీసులకు చిక్కారు. వారి నుంచి 582 గ్రాముల 26 బంగారు గొలుసులు, 5 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: