చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రారంభించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 5 వేల 2 వందల 57 మహిళల ఖాతాల్లోకి రూ.12.19 కోట్ల నగదు జమ అవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు లాక్‌డౌన్‌ను పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: 'న్యాయం చేయకపోతే.. మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటాం'