ETV Bharat / state

విదేశీ టూ స్వదేశీ... వయా మహేశ్..!

ఫజితాస్‌, కెఫిడియా వంటి మెక్సికన్‌ వంటలు.. పెన్నె పాస్తా విత్‌ అల్ఫెడోసాస్‌, స్పెగితో అలోలియో, పుస్లీ విత్‌ క్రిమి టమోటసాస్‌, ఆనియన్‌ బెల్‌ పెప్పర్స్ వంటి ఇటాలియన్ వంటలు... చికెన్‌ 65, నూడుల్స్‌, ఫ్రైడ్‌ రైస్‌, వెజ్‌ మంచూరియా వంటి చైనీస్‌ రుచులు... వీటిని తినాలంటే విదేశాలకో, నగరాల్లోని రెస్టారెంట్లకో వెళ్లాలి. కానీ ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎక్కడికి వెళ్లనవసరం లేదు. ఇంట్లో ఉండి ఆ రుచులను ఆస్వాదించొచ్చు. నచ్చిన విదేశీ వంటకం టేస్ట్ చేయొచ్చు. అదెలాగంటారా.. అయితే ఇది చదివేయండి.

author img

By

Published : Jun 14, 2020, 2:11 PM IST

young chef mahesh story in chittore district
యంగ్ చెఫ్ మహేశ్

చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు తాము అనుకున్నప్పుడు విదేశీ వంటకాల రుచి చూడొచ్చు. తమకిష్టమైనది వండించుకుని తినొచ్చు. ఇంటి దగ్గరే దమ్‌ బిరియానీ, హలీం, కబాబ్‌ వంటి భారతీయ వంటకాలు చేసేసుకోవచ్చు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా... దీని అంతటికి కారణం కరోనా. అవును మీరు విన్నది నిజమే. కరోనా కారణంగానే వారికి విదేశీ వంటకాలు తినే అవకాశం వచ్చింది.

లాక్‌డౌన్‌తో ఇంటి నుంచి బయటకు వెళ్లలేక... మాస్క్‌లు ధరించలేక... గంటకోసారి చేతులు కడుక్కోలేక... వీటన్నిటికి కారణమైన కరోనా మహమ్మారిపై ప్రపంచమంతా మండిపడుతుంటే.. దానివలనే ప్రపంచ వంటకాలు తమ ముంగిటకు వచ్చాయని చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగినేనిపల్లెకు చెందిన విజయ్ బాబు వృత్తిరీత్యా హైదరాబాద్​లో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు మహేశ్ హోటల్ మేనేజ్​మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ కలినరీ ఆర్ట్స్​లో డిగ్రీ చదివారు. దుబాయ్​లోని ప్రఖ్యాత హోటల్ అట్లాంటిస్ ది ఫామ్​లో ఉద్యోగం సాధించారు. అనంతరం ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్ జేడబ్ల్యూఎస్ మార్కస్​లో చేరారు. తర్వాత సముద్రంలో ప్రయాణించే ప్రిన్సెస్ క్రూయిజ్​లైనర్ షెఫ్​గా కెరీర్ ప్రారంభించారు.

కరోనాతో ఇక్కడే ...

అందులో 9 నెలలు ప్రయాణించడం, 3 నెలలు సెలవులు ఉంటాయి. అలా ఐరోపా, అమెరికా, మధ్య ఆసియా, ఖండాలను చుట్టి గత ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చి, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని ఇంటికి చేరుకున్నారు. మళ్లీ మే 15న ఉద్యోగానికి వెళ్లాల్సి ఉండగా కరోనా కారణంగా వెళ్లలేకపోయారు. అప్పట్నుంటి గ్రామంలోనే ఉన్న మహేశ్.. స్థానికులకు తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని పరిచయం చేశాడు. రంజాన్ మాసంలో తమ స్నేహితుడికి హలీం చేసి పెట్టారు. అలా తన వంటకాల రుచి అక్కడి వారికి చూపిస్తున్నాడు.

ఆర్డర్లపై తయారీ...

నగరాలకే పరిమితమైన హలీం వంటకం... తమ వరకు రావటంతో గ్రామస్థులు ఆర్డర్లపై హలీం తయారుచేయించుకున్నారు. రంజాన్‌ ముగిశాక ప్రపంచ దేశాల వంటకాలను ఒక్కొక్కటిగా పరిచయం చేయడం ప్రారంభించారు మహేశ్. ఆనోటా ఈనోటా అతని పాకశాస్త్ర ప్రావీణ్యం ప్రచారం కావటంతో తమ ఇంట జరిగే శుభ కార్యాలకు, పార్టీలకు మహేశ్​ను వంట చేసేందుకు పిలిచేవారు. కరోనా లాక్‌డౌన్‌తో వాహనాలు తిరగక గ్రామం నుంచి పాల రవాణా ఆగిపోయింది. వందల లీటర్ల పాలు వృథా అవుతున్నందున.. మహేశ్ గ్రామస్థులతో పాలకోవా, కుల్ఫీ లాంటి వాటిని తయారుచేయించారు. దాంతో అతని దగ్గర వివిధ వంటకాలు నేర్చుకుంటున్నారు స్థానికులు.

సాధారణ వంటకాలతో పాటు, విదేశీ వంటకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిచయం చేస్తున్న మహేశ్.. తన వంట తిన్నవాళ్లు ఇచ్చే ఆశీస్సులే తనకు బహుమానాలంటున్నాడు.

ఇవీ చదవండి...

బిల్​గేట్స్​పై ఆగని విమర్శలు.. నెట్టింట మళ్లీ చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.