వైఎస్సార్ చేయూత ఆర్థిక సాయం దక్కలేదని చిత్తూరులోని ఎల్లమ్మ వీధికి చెందిన మల్లిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ఆమె శరీరంపై నీళ్లు చల్లారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆమె తన కుమారుడితో బైఠాయించారు. బీసి కులానికి చెందిన తాను వైఎస్సార్ ఆసరా పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే తనకు ఆర్థిక సాయం అందలేదని..తనతో పాటు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందినట్లు చెప్పారు. దీనిపై వార్డు సచివాలయ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లూ వివరించారు. అనంతరం ఆమె డీఆర్వో మురళికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి