కడప జిల్లా రైల్వేకోడూరు టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ పి.సుజయ్ కుమార్ భార్య సంధ్యకు ఏప్రిల్ 25న కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో... ఈ విషయాన్ని డీఐజీ క్రాంతి రాణా టాటా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఐజీ... బాధితురాలిని హుటాహుటిన తిరుపతిలోని అంకుర ఆస్పత్రికి తరలించారు.
వైద్యుల చొరవతో బాధితురాలు మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను 25 రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉంచి, సోమవారం డిశ్ఛార్జ్ చేశారు. ఇంట్లో కూడా బాధితురాలికి ఆక్సిజన్ అవసరం అని వైద్యులు చెప్పడంతో డీఐజీ క్రాంతి రాణా టాటా ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: