ETV Bharat / state

సమీప బంధువుల మధ్య కత్తులతో ఘర్షణ... మహిళ మృతి - చిత్తూరు జిల్లా నేర వార్తలు

సమీప బంధువుల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాలు ఓ మహిళ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. వ్యవసాయ పొలం విషయంలో జరిగిన గొడవలో కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తమిళనాడులోని వేలూరులో చికిత్స పొందుతున్నారు.

woman died on assault to two groups in kanikapuram chitthore district
సమీప బంధువుల మధ్య కత్తులతో ఘర్షణ... మహిళ మృతి
author img

By

Published : Jan 6, 2021, 11:01 PM IST

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కనికాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, విజయ శేఖర్​ రెడ్డి సమీప బంధువులు. వ్యవసాయ పొలాల విషయంలో వీరి మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పథకం ప్రకారం నారాయణ... శేఖర్ పొలంలో నాగలి దున్నుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. నారాయణ కుటుంబ సభ్యుల చేష్టలకు విసిగిపోయిన శేఖర్ కుటుంబసభ్యులు... గొడవకు దిగారు. అదను కోసం వేచిచూస్తున్న నారాయణ కుటుంబ సభ్యులు... చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల కళ్లలో కారంకొట్టి, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో శేఖర్ వర్గీయులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా... చంద్రకళ మృతి చెందింది. మిగిలిన వారిని తమిళనాడులోని వేలూరులో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి.

ఆ డబ్బులు ఎవరేశారో.. ఎక్కడి నుంచి వచ్చాయో మరి!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.