ETV Bharat / state

రెట్టింపు నగదు పేరుతో మోసం.. మహిళ అరెస్ట్ - చిత్తూరు జిల్లా ఏర్పేడులో మోసం చేసిన మహిళ అరెస్టు

వెయ్యు రూపాయలిస్తే మీకు రూ.4వేలు ఇస్తామంటూ కొందరు వ్యక్తులు మాటలతో బురిడి కొట్టిస్తారు. కొన్ని రోజులకు ఓ బ్యాగ్ పంపించి అందులో పైభాగంలో డబ్బులు ఉంచి.. కింది భాగంలో కాగితాలు పెట్టి ఇస్తారు. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటే పొరపాటే. చిత్తూరు జిల్లా ఏర్పేడులో.. ఓ మహిళ రెట్టింపు నగదు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని నమ్మించింది. చివరికి అది మోసమని తెలుసుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా.. గుట్టు రట్టయ్యింది.

రెట్టింపు నగదు పేరుతో మోసం చేసిన మహిళ అరెస్ట్

author img

By

Published : Mar 20, 2021, 1:12 PM IST

రెట్టింపు నగదు పేరుతో మోసం చేస్తున్న మహిళను చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ధనలక్ష్మి అలియాస్ అనూష(35), అనంతపురానికి చెందిన సూర్య, మరో వ్యక్తి కలిసి.. రెట్టింపు నగదు పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

కడప జిల్లాకు చెందిన సుధాకర్​ను రూ.12లక్షలు ఇస్తే నాలుగు రెట్లు ఇస్తామని నమ్మించి.. నాలుగు రోజుల కిందట డబ్బు తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం.. రెండ్రోజుల కిందట సుధాకర్​కు ఏర్పేడు సమీపంలో రెండు బ్యాగులు అందజేశారు. సుధాకర్ ఇంటికి వెళ్లి బ్యాగును తెరిచి చూడగా.. బ్యాగు పైభాగంలో మాత్రమే రూ.100 నోట్ల కట్టలు ఉంచి.. కింది భాగంలో కాగితాలు ఉంచారు. దీంతో సుధాకర్ ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. ధనలక్ష్మిని అరెస్టు చేసి.. రూ.9లక్షలు రికవరీ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఏర్పేడు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: బాలుడిపై అడవి పంది దాడి.. రక్షించిన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.