చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైకాపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానిక ఎంఎంవాడకు చెందిన బత్తయ్య స్నేహితులతో కలిసి తొట్టంబేడు మండలం శివనాదపురానికి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. పని నిమిత్తం మార్గమధ్యలో ఆగారు. అదే సమయంలో అదును చూసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తి, రాడ్లతో బత్తయ్యపై దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బత్తయ్యను స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడి నుంచి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. విపక్షాలకు చెందిన వ్యక్తులే తమపై దాడి చేసినట్లు బత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీకాళహస్తిలో వైకాపా కార్యకర్తపై దుండగుల దాడి - attacked on ycp leader in srikalahasthi
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైకాపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విపక్షాలకు చెందిన వ్యక్తులే తమపై దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైకాపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానిక ఎంఎంవాడకు చెందిన బత్తయ్య స్నేహితులతో కలిసి తొట్టంబేడు మండలం శివనాదపురానికి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. పని నిమిత్తం మార్గమధ్యలో ఆగారు. అదే సమయంలో అదును చూసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తి, రాడ్లతో బత్తయ్యపై దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బత్తయ్యను స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడి నుంచి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. విపక్షాలకు చెందిన వ్యక్తులే తమపై దాడి చేసినట్లు బత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి:
జనసేన నాయకురాలి కారుపై దుండగుల దాడి