Two people died drinking contaminated water: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో కలుషిత మంచి నీళ్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీళ్లతో పాటు ఆ జలాలు తాగడం ద్వారా మరి కొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మొత్తం ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖైసర్అనే యువకుడు, అఫ్రీన్ సుల్తానా(22) మృతి చెందారు.
మృతురాలు సుల్తానాకు 6నెలల కుమార్తె ఉండగా.. ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. దీనంతటికీ కలుషిత జలాలే కారణమని వైద్యులు తెలిపారు. జలమండలి మంచినీళ్లు కలుషితంగా వస్తున్నాయని అందువల్లే అందరూ అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలమండలి అధికారులు: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనపై జలమండలి అధికారులు స్పందించారు. మైలార్‌దేవ్‌పల్లి మొఘల్ కాలనీలో జలమండలి అధికారులు నీటి నమూనాలు సేకరించారు. మొఘల్ కాలనీలో నీటి నమూనాలు సేకరిస్తున్నమని తెలిపారు. మంచినీరు కలుషితం కాలేదని స్పష్టం చేశారు. మైలార్‌దేవ్‌పల్లిలో పైపులైన్లను అధికారులు పరిశీలించారు. పైపులైన్ పరిశీలించిన వాటర్ వర్క్స్ మేనేజర్ అబ్దుల్ ఖదీర్‌పై స్థానిక టీఆర్ఎస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: