చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం వీవర్స్ కాలనీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పీలేరు ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు... చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం వంకమద్దివారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (47).... పీలేరు పట్టణ సమీపంలోని వీవర్స్ కాలనీలో చేనేత పని చేస్తున్నారు. ఇక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఎర్రావారిపాలెం మండలం పులిపర్తివారిపల్లికి చెందిన అమరావతి (38)తో మూడేళ్లుగా పరిచయం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం అయినా తలుపులు తీయలేదు. ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కృష్ణయ్య... సిబ్బందితో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ విగతజీవులుగా ఉండటాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదీ చదవండి:తప్పు చేసింది.. సరిదిద్దుకో అన్నందుకు కొడుకునే కడతేర్చింది