చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లెలో ఈత సరదా.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తవ్విన కుంటలో ఈత కొట్టేందుకని దిగి లక్ష్మీతేజ, రాకేశ్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు.. మృతి చెందారు. ఈత కొట్టేందుకని మొత్తం ఐదుగురు కుంటలో దిగారు.
నీళ్ల లోతు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మునిగిపోయారు. వారి కేకలు విని దుస్తులు ఉతుకుతున్న 15 ఏళ్ల బాలిక రూప కుంటలో దిగి ముగ్గురు పిల్లల్ని కాపాడింది. అప్పటికే మరో ఇద్దరు నీటమునగటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి:
డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్.. వ్యక్తిపై కేసు నమోదు