చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నారగల్లులో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ఈత రాక బావిలోకి దిగి మృత్యవాతపడ్డారు. గ్రామానికి చెందిన ప్రత్యేశ్, వినీత కుమారులు ఎన్రిన్ (10), ఎబినేశన్ (12) సరదాగా ఈత కొట్టడానికి గ్రామ సమీపంలోని బావిలోకి దిగారు.
అయితే.. ఈత పూర్తిగా రాకపోవడంతో.. అన్నదమ్ములిద్దరూ నీటిలో మునిగిపోయారు. అటువైపు వెళ్లేవారు మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: