తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. వీఐపీ దర్శనాలు కారణంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని వాదించారు. వాదనలు విన్న కోర్టు కేసును వారం రోజులకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి..