తిరుమల(Tirumala) శ్రీనివాసుని ఆలయంలో జూన్ నెలలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను తితిదే ప్రకటించింది.
- నరసింహ జయంతోత్సవంలో 10వ రోజైన జూన్ 3న ఉత్తర మాడ వీధిలోని రాతి మండపంలో శ్రీ మలయప్పస్వామివారికి ఆస్థానం.
- జూన్ 4న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, 7వ మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహం వద్ద హనుమజ్జయంతి వేడుకలు.
- 12న శ్రీ పెరియాళ్వార్ల ఉత్సవారంభం.
- 15న మిథున సంక్రమణం.
- 20న ప్రత్యేక సహస్రకలశాభిషేకం.
- 21న మతత్రయ ఏకాదశి, శ్రీ పెరియాళ్వార్ల శాత్తుమొర.
- 22 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్ఠాభిషేకం.
- 24న ఏరువాక పూర్ణిమ
ఇదీ చదవండీ.. కొత్త జిల్లాల ఏర్పాటుకు.. ముందే అనుమతి తీసుకోవాలి: కేంద్రం