ETV Bharat / state

తితిదే ఉద్యోగిని హత్య.. ఆర్థిక లావాదేవీలే కారణమా? - ttd murder news

చిత్తూరు జిల్లాలో చిగురుపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని కాణిపాకం పోలీసులు గుర్తించారు. తితిదేలో స్వీపరుగా పనిచేస్తోన్న ఆమె.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

murder
murder
author img

By

Published : Jun 2, 2021, 10:40 PM IST

చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిగరపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని కాణిపాకం పోలీసులు గుర్తించారు. మృతురాలు తితిదే ఉద్యోగి సరోజమ్మ(59)గా పోలీసులు తెలిపారు. స్వీపరుగా తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న సరోజమ్మ.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఆమె కనిపించటం లేదంటూ కుటుంబసభ్యులు.. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. సరోజమ్మ మృతదేహాన్ని గుర్తించిన కాణిపాకం పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. తితిదేలో పనిచేస్తున్న ఓ ఒప్పంద ఉద్యోగి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది. దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సరోజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి: SGB: కరోనాతో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.