రథసప్తమి ఏర్పాట్లపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రథసప్తమి రోజున భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. మాడ వీధులలో వాహన సేవలను తిలకించేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు.. అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. అవసరమైన వాహనాలు, శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలని... గ్యాలరీల్లో ఉన్న భక్తులకు అందించే సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులను నియమించాలని దిశా నిర్దేశం చేశారు.
శ్రీవారి ఆలయంలో మాడ వీధుల్లో ఆకర్షణీయంగా పుష్పాలంకరణలు చేపట్టాలి. వాహనసేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులచే భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనసేవకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించేందుకు ప్రముఖ పండితులతో వ్యాఖ్యానం ఏర్పాటు చేయాలి. తితిదే నిఘా, భద్రతా విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని మెరుగైన భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలి. మాడ వీధుల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. - ధర్మారెడ్డి, తితిదే ఈవో
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య విభాగం ఆధ్వర్యంలో.. మాడ వీధుల్లోని అన్ని ముఖ ద్వారాల వద్ద అంబులెన్స్‌లు, అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. రథసప్తమి పర్వదినాన తిరుమల - తిరుపతి మధ్య వీలైనన్ని ఎక్కవ బస్సులు నడపాలని ఆర్టీసీ ఆధికారులను కోరారు.
ఇదీ చదవండి: