'స్వచ్ఛ సర్వేక్షన్-2021లో మొదటి స్థానమే టార్గెట్' - స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో తిరుపతి మున్సిపాలిటీ గురి
పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్-20201లో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వైపింగ్ యంత్రాలతో వినియోగ ఛార్జీలను వసూళ్లు చేయాలని ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షన్-2021లో మొదటి స్థానం సాధించడానికి అందరూ కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా సూచించారు. వినియోగ ఛార్జీలను స్వైపింగ్ యంత్రాలతో వసూళ్లు చేయాలని ఆదేశించారు. కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో.. శానిటరీ అధికారులు, కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడేవారికి ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.
వ్యర్థాల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయాలని కమిషనర్ కోరారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా నగరవాసులను సన్నద్ధం చేయాలన్నారు. వ్యర్థాలను రోడ్లు, మురికి కాలువల్లో వేసే వారికీ జరిమానాలు విధిస్తామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించడానికి.. ఆయిల్ బాల్స్, పాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు.