ETV Bharat / state

'స్మార్ట్ సిటీ పనులు సత్వరం పూర్తి చేయాలి' - తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డ్ సమావేశం

స్మార్ట్ సిటీ పనుల పురోగతిని తెలుసుకునేందుకు తిరుపతి నగరపాలక సంస్థ సమావేశమైంది. జనచైతన్య లేఅవుట్ వద్ద ఉద్యానవనం, ప్రకాశం పార్కు అభివృద్దికి నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. పనుల్లో జాప్యం జరుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

smart city board meeting
స్మార్ట్ సిటీ
author img

By

Published : Dec 20, 2020, 9:41 AM IST

తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా అధ్యక్షతన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం జరిగింది. తిరుపతిలో జనచైతన్య లేఅవుట్ వద్ద రెండు కోట్ల రూపాయలతో ఉద్యానవనం నిర్మాణం, ప్రకాశం పార్కు అభివృద్దికి 85 లక్షల రూపాయలు కేటాయిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.

నగరంలో జరుగుతున్న గరుడ వారధి, భూగర్భ విద్యుత్ కేబుల్ పనులతో పాటు ఇతర పనుల పురోగతిపై సమీక్షించారు. పనులు శరవేగంగా పూర్తి చేయాలని, ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఎన్.భరత్ గుప్తా ఆదేశించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి, తుడా వీసీ హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పునఃప్రారంభంతో కళకళలాడుతున్న నగరవనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.