అత్యవసరమైతే తప్ప తిరుపతి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని... పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ వాహనాలలో తిరుగుతూ తిరుపతి నగర వీధుల్లో లాక్డౌన్పై అవగాహన కల్పించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. స్వీయ నిర్బంధం పాటించాలని రెడ్ జోన్ ఏరియాలో ఉంటున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వారికి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి... లాక్డౌన్ నిబంధనలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా వైరస్ను కట్టడి చేయటంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఇదీ చదవండి: తంబళ్లపల్లె మండలంలో మెుదటి కరోనా పాజిటివ్ కేసు