చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురంలో విషాదం జరిగింది. అన్నాస్వామి గండిచెరువు క్వారీగుంతలో గుర్తుతెలియని మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. చెరువులో తేలుతున్న ఓ మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఉదయం స్థానికులు గుర్తించి.. రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు. క్వారీగుంత సమీపంలోని కంపోస్టు యార్డులో ఓ ద్విచక్ర వాహనం ఉండటంతో.. మృతులకూ ఆ వాహనానికి సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారిని పెనుమూరు మండలం గుండ్యాలపల్లి వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: