చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎర్రకుంటలోని ఓ ఇంట్లో కొండచిలువ తిష్టవేసింది. ఇంట్లో కొండచిలువను చూసిన కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. కనకయ్య ఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన కొండచిలువ.. ఓ మూలకు చేరింది. అది గమనించిన ఇంటి సభ్యులు.. భయంతో రాత్రంతా పడుకోకుండా ఉండిపోయారు. ఉదయం అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేయటంతో వారు వచ్చి.. దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.
ఇవీ చూడండి...