ETV Bharat / state

పదవీయోగం తర్వాత తొలిసారి స్వస్థలాలకు మంత్రులు... భారీ ర్యాలీలతో స్వాగతం పలికిన కార్యకర్తలు - కొత్త మంత్రుల భారీ స్వాగతం

పదవీయోగం తర్వాత తొలిసారి సొంత ప్రాంతంలో అడుగుపెట్టిన అమాత్యులకు అడుగడునా అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. భారీ గజమాలలతో స్వాగత సత్కారాలు చేస్తూ అభిమానం చాటుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నగరి వరకు భారీ ర్యాలీతో రోజాకు ఆహ్వానం పలకగా... విశాఖలో ముత్యాలనాయుడి అభిమానులు ప్రదర్శన నిర్వహించారు. మంత్రి పదవి కోల్పోయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం ఒంగోలులో భారీ స్వాగతం పలికి... మీ వెంటే మేమున్నామంటూ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు.

ministers
ministers
author img

By

Published : Apr 19, 2022, 5:36 AM IST

మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్‌.కె.రోజా నగరి రావడంతో... వైకాపా అభిమానులు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నగరి వరకు అడుగడునా ఆమెకు హారతులు పట్టారు. పుత్తూరులో భారీ గజమాలతో సత్కరించారు. నగరి ప్రజల ఆశీస్సుల వల్లే మంత్రి కాగలిగానన్న రోజా... ఇంతటి అభిమానం చూపిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

పదవీయోగం తర్వాత తొలిసారి స్వస్థలాలకు మంత్రులు... భారీ ర్యాలీలతో స్వాగతం పలికిన కార్యకర్తలు

పుష్పగుచ్చాలు ఇచ్చి : మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.... శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. అనంతరం చిన్న ముషిడివాడ నుంచి సర్క్యూట్ హౌస్ వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సర్క్యూట్ హౌస్ గార్డ్స్ నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.

పదవి కోల్పోయిన: మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో పదవి కోల్పోయి తొలిసారిగా ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి... కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బాపట్ల, ప్రకాశం జిల్లాల సరిహద్దు నుంచే భారీ కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. గజమాలలతో సత్కరించి, బాణసంచా కాల్చుతూ హోరెత్తించారు. ఎమ్మెల్యే కరణం బలరామ్, జెడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు ఒంగోలు మేయర్‌ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి కష్టాలు... బొగ్గు లేదు.. డబ్బుల్లేవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.