రైతుల కన్నీరు.. రాష్ట్ర సంక్షేమానికి మంచిది కాదని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెదేపా నేతలు హెచ్చరించారు. వెదురుకుప్పంలో జిల్లా పార్టీ సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు ముని చంద్రారెడ్డి... సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన అన్నదాతలు ఆవేదన చెందడం... ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజధాని రైతులకు న్యాయం చేసి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల కోసం తెదేపా పోరాటం కొనసాగుతుందన్నారు.
ఇదీ చదవండి: