ప్రజా సమస్యల కంటే ప్రచారాలకే అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. రహదారుల విస్తరణ పేరుతో ఇళ్ల యజమానులకు సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళల్లో భవనాలను కూల్చివేసే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. అధ్వానంగా మారిన రహదారికి.. తాత్కాలిక మరమ్మతులు చేపట్టకుండా విస్తరణ పేరుతో ఏడాదిగా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. నాయకుల నిర్లక్ష్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల కష్టాల్లో చిక్కుకుపోతున్నారని విమర్శించారు. అధికార దర్పంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: