చెరువులో తేలిన విశ్రాంత ఏఎస్సై మృతదేహం - చిత్తూరు తాజా వార్తలు
చిత్తురు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మాజీ ఏఎస్సై అనుమానస్పద స్థితిలో చెరువులో మృతదేహమై తేలడం కలకలం రేపింది. వాకింగ్ కోసం బయటికెళ్లిన ఆయన విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
![చెరువులో తేలిన విశ్రాంత ఏఎస్సై మృతదేహం suspicious death of former ASI in chittoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9204538-589-9204538-1602881895599.jpg?imwidth=3840)
చిత్తూరులో మాజీ ఏఎస్సై అనుమానస్పద మృతి
చిత్తూరు నగరంలో విశ్రాంత ఏఎస్సై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం పోలీసు శాఖలో ఏఎస్సైగా పనిచేసి మూడేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. వాకింగ్‌కు వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు ఆటో డ్రైవర్‌ను విచారించగా కట్టమంచి చెరువు కట్ట వద్ద సుబ్రహ్మణ్యాన్ని వదిలి వెళ్లానని తెలిపాడు. అక్కడికి వెళ్లి వెతకగా మృతదేహం చెరువులో తేలింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.