చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్స్ యాజమాన్యం.. బకాయిలను వెంటనే చెల్లించాలని చెరకు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు.. తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. రైతులకు ప్రభుత్వమే చొరవ తీసుకుని యాజమాన్యం నుంచి బకాయిలు ఇప్పించాలని వేడుకున్నారు.
మండలంలోని 3 వేల రైతులకు సుమారు 25 కోట్ల రూపాయిలు బకాయిలు ఉన్నట్లు వాపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి కనీసం కూలీల డబ్బు ఇవ్వలేదని.. అది కూడా పెండింగులో పెట్టి రైతులను కష్టాల్లోకి నెడుతున్నారని ఆవేదన చెందారు. వెంటనే బకాయిలు చెల్లించకుంటే నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: