ETV Bharat / state

ద్విచక్రవాహనం-ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

వారందరూ స్నేహితులు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్నారు. ఆదివారం సెలవు కావటంతో కాణిపాకం వినాయకుడి దర్శనానికి బయల్దేరారు. సరదాగా రెండు ద్విచక్రవాహనాలపై పయనమయ్యారు. సంతోషంగా సాగిపోతున్న వారి ప్రయాణంలో ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. అభిరామ్, అలేఖ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని బస్సు ఢీకొట్టటంతో ఇద్దరూ మృతి చెందారు.

ద్విచక్రవాహనం-ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
ద్విచక్రవాహనం-ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
author img

By

Published : Mar 7, 2021, 4:30 PM IST

Updated : Mar 7, 2021, 5:20 PM IST

ద్విచక్రవాహనం-ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు స్నేహితులు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఐతేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. రాజమహేంద్రవరానికి చెందిన అభిరామ్, నెల్లూరుకు చెందిన అలేఖ్య... తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్ చివరి ఏడాది చదువుతున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు విద్యార్థులు కలిసి రెండు ద్విచక్రవాహనాలపై కాణిపాకం బయలుదేరారు. మార్గమధ్యంలో ఐతేపల్లి వద్దకు చేరుకోగానే.. అభిరామ్, అలేఖ్య ప్రయాణిస్తున్న బైక్​ను చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిరామ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అలేఖ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రురాలిని రుయా ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ అలేఖ్య మృతి చెందింది. శవ పరీక్ష నిమిత్తం అభిరామ్ మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ఇక్కడ పాదయాత్ర, దిల్లీలో పాదపూజా..?: నారాయణ

Last Updated : Mar 7, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.