తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరికి సంబంధించిన అదనపు కోటా టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 19న రథసప్తమికి సంబంధించిన 25 వేల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. రోజుకు 5 వేల టికెట్లు చొప్పున అదనపు టికెట్లను ఆలయ అధికారులు విడుదల చేశారు.
ఫిబ్రవరికి సంబంధించి ఇప్పటికే రోజుకు 20 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 5 వేలతో కలిపి ఆ టికెట్ల సంఖ్య 25 వేలకు పెరిగింది.
ఇదీ చూడండి. పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు