తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వేడుకలకు సంబంధించిన వివరాలను తితిదే ప్రకటించింది. సెప్టెంబరు 29న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 30వ తేదీన ధ్వజారోహణంతో మొదలై తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
* సెప్టెంబరు 1న శ్రీవరాహ జయంతి, శ్రీ బలరామ జయంతి
* సెప్టెంబరు 2న వినాయక చవితి
* సెప్టెంబరు 3న ఋషి పంచమి
* సెప్టెంబరు 10న శ్రీ వామన జయంతి
* సెప్టెంబరు 12న అనంత పద్మనాభ వ్రతం
* సెప్టెంబరు 29న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
* సెప్టెంబరు 30న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తితిదే తెలిపింది.
ఇదీ చూడండి: తితిదేకు ఆధునాతన వాహనం విరాళం