చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో స్వామి వారు అభయమిచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనంజయులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి