తిరుపతి నగరపాలక సంస్థ రెండో కౌన్సిల్ (Second Council Meeting) సమావేశం రసాభాసగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి దొడ్డిదారిన గెలిచి తిరుపతి నగర అభివృద్ధికి (Tirupati Urban Development) మొండి చేయి చూపించారని.. కార్పొరేటర్ ఎస్కె.బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి సర్కార్ల హయాంలో రూ.84 కోట్లు మాత్రమే ఇస్తే, సీఎం జగన్ సర్కార్ మాత్రం ఏకకాలంలో రూ.180 కోట్లు కేటాయించిందన్నారు.
అభ్యంతరం తెలిపిన తెదేపా..
ఈ క్రమంలో స్పందించిన తెదేపా కార్పొరేటర్ ఆర్.సి. మునికృష్ణ (R.C. Munikrishna) అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అధికార పార్టీ కార్పొరేటర్లు మునికృష్ణపైకి దూసుకురావడమే కాకుండా ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా మండిపడ్డారు.
వైకాపా ముందు నిలువలేక..
తెదేపా నుంచే ఒకే కార్పొరేటర్ ఉండటంతో వైకాపా కార్పొరేటర్ల (Ysrcp Corporators) ముందు ఆయన నిలువలేకపోయారు. కౌన్సిల్ సమావేశంలో భాగంగా అంతకుముందు ఐదు మంది కో-ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇవీ చూడండి : Amul project : 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'