ETV Bharat / state

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం - ఏపీలో స్కూళ్లు పునః ప్రారంభం

కరోనా నేపథ్యంలో... సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానుండటంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ తరగతుల నిర్వహణకు అధికారులు సన్నద్దమయ్యారు.

schools-re-opening-in-chittor
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
author img

By

Published : Nov 2, 2020, 9:10 AM IST

చాలాచోట్ల చెత్త తొలగింపు మినహా బడుల శుభ్రత విషయంలో చర్యలు కొరవడ్డాయి.. అక్కడక్కడా శానిటైజ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు మినహా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదు.. కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానుండటంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ తరగతుల నిర్వహణకు చిత్తూరు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైనా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.

నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం..

బడి ఆవరణలోకి ప్రవేశించగానే విద్యార్థులు ముందుగా శానిటైజ్‌ చేసుకోవాలి. ఇందుకు అవసరమైన శానిటైజర్‌ను అందుబాటులో ఉంచారు. ఒంటిపూట పాఠశాలల నిర్వహణకు వీలుగా తొమ్మిది, పదో తరగతులకు రోజుకు మూడు పీరియడ్లతో ప్రత్యేక కాలమాన పట్టిక రూపొందించారు. ప్రతి పీరియడ్‌ పూర్తైన తర్వాత విద్యార్థులకు విరామం ఇస్తారు. మాస్కులు ధరించి పిల్లలు, ఉపాధ్యాయులు భౌతిక దూరం పాటిస్తూ పాఠశాలకు హాజరు కావాలి. ఇటీవల పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేశారు. ఆయా నిధులతో శానిటైజర్‌ కొనుగోలు చేసి నిల్వ చేశారు.

* జిల్లాలో ఉన్నత పాఠశాలలు : 738

*తొమ్మిదో తరగతి విద్యార్థులు : 38,425 మంది

*పదో తరగతి విద్యార్థులు : 35,808 మంది

ప్రశ్నార్థకంగా పరిశుభ్రత?

పాఠశాలలు తెరచుకుంటున్న నేపథ్యంలో ఆదివారం జిల్లాలోని పూతలపట్టు, మదనపల్లె, వి.కోట, చిత్తూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిచోట్ల తరగతి గదులను నీటితో శుభ్రపరిచారు. ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇక అంతే. అక్కడ చేపట్టిన పనులేవీ లేవు. ఎక్కువ పాఠశాలల్లో తరగతి గదులను చీపురుతో శుభ్రం చేసేసి.. ఆపై నీటితో కడిగి వదిలేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల అసలు శానిటైజ్‌ చేయనేలేదు. కొందరు సోమవారం ఉదయం సమయంలో శానిటైజ్‌ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక.. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన తల్లిదండ్రుల కమిటీ సమావేశాలకు చాలామంది హాజరుకాకపోవడం గమనార్హం.

పదివేల మందికే పరీక్షలు..

జిల్లా వ్యాప్తంగా 16,732 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. వీరిలో గత నాలుగు రోజులుగా పదివేల మంది మాత్రమే కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 47 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

నియమావళి పాటించాల్సిందే

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా జాగ్రత్తలు విధిగా పాటిస్తూ మాస్కు ధరించి హాజరు కావాలి. ప్రతి టీచర్‌ కరోనా పరీక్ష తప్పక చేసుకోవాలి. పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. - వెంకటకృష్ణారెడ్డి, ఆర్జేడీ, పాఠశాల విద్య, రాయలసీమ

ఇవీ చదవండి

ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.