బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకున్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఆలయ ఈవో లాంఛనాలతో వారికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సూచనలతోనే వైకాపాపై బురద చల్లే కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్నారని రోజా ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే కంటెంట్‌కి పవన్ కామెంట్ చేయడం మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై నోరు మెదపని ఆయన...100 రోజుల వైకాపా పాలనపై విమర్శలు చేయడం తగదన్నారు.
ఇదీ చూడండి: ముగిసిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు