దొంగలు అమ్మవారి నగలనూ వదలటంలేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మెురవపల్లిలోని ధనకొండ గంగమ్మ ఆలయంలో సుమారు రూ.20 లక్షల విలువైన అమ్మవారి నగలు దోచుకెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగినట్లు గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీం సాయంతో ఆలయాన్ని పరిశీలించారు. వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కల్కి ఆశ్రమాల్లో మరోసారి ఐటీ సోదాలు