ETV Bharat / state

రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు ఇలా రట్టు చేశారు - రైస్ పుల్లింగ్ పేరుతో ఘారానా మోసం తాజా వార్తలు

పెద్ద అట్టపెట్టెలో నకిలీ పాత్ర పెట్టి బ్యాటరీ విద్యుత్తు తీగలతో జిమిక్కులు చేసిచూపి రైస్‌పుల్లింగ్‌ పాత్ర అంటూ... ఘరానా మోసం చేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు సహా తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రూ.1.30 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Rice Pulling gang
చిత్తూరులో రైస్ పుల్లింగ్ పేరుతో ఘారానా మోసం
author img

By

Published : Feb 12, 2020, 5:18 PM IST

రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు ఇలా రట్టు చేశారు

తమిళనాడులోని తిరుపత్తూరుకు చెందిన నవీన్‌కుమార్‌ స్టూడియో నడుపతూ జీవనం సాగిస్తున్నాడు. తరచూ అతడు గుడుపల్లెకు వస్తుంటాడు. అతడికి శీనప్ప, మహదేవ అనే ఇరువురు ప్రథమంగా రైస్‌పుల్లింగ్‌ ఆశ చూపారు. ఆపై వారిద్దరు సహా మరో ఏడుగురు అతడికి మాయమాటలు చెప్పి అరుదైన రైస్‌పుల్లింగ్‌ పాత్ర ఉందంటూ నమ్మించి ఆకర్షించారు. కంతుల వారీగా అతడి నుంచి రూ.2.10 కోట్లు వసూలు చేశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా... బాధితుడి సాయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించి మోసం ఎలా జరిగింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారించారు.

ఈ వ్యవహారంలో నిందితులు తొమ్మిది మందిగా తేలడంతో పలు బృందాలు వారి కోసం గాలించాయి. మంగళవారం గుడుపల్లె మండలంలోని కామసముద్రం-బిసానత్తం కూడలి వద్ద వాహనాల తనిఖీ సమయంలో రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనంపై వస్తున్నవారు పోలీసులను చూసి వెనుతిరిగే ప్రయత్నం చేశారు. అనుమానంతో పోలీసులు వారిని వెంబడించి అడ్డుకుని వాహనాలు తనిఖీ చేశారు. వారి వద్ద కొన్ని పరికరాలు ఉండటం, పొంతన లేని సమాధానం చెప్పడంతో అందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు.

చిత్తూరు జిల్లా గుడుపల్లికి చెందిన శీనప్ప, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహదేవ, రామచంద్రనాయుడు, వినాయగం, శేఖర్‌, కర్ణాటక రాష్ట్రానికి చెందిన గంగాధర్‌ అలియాజ్‌ రాజు, శివకుమార్‌ అలియాజ్‌ ధనశేఖర్​ను రైస్‌పుల్లింగ్‌ కేసులో నిందితులుగా గుర్తించారు. వీరు కాజేసిన రూ.2.10కోట్లలో నిందితుల నుంచి రూ.1.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఇవీ చూడండి...

పోషణ కోసం వలసవెళ్లారు.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.