ETV Bharat / state

ఎన్నో ప్రత్యేకతలకు నెలవు...రేణిగుంట - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు

రేణిగుంట... ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. పంచాయతీ ఉపాధి కేంద్రంగా మారింది. విభిన్న మతాలు.. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 20 రాష్ట్రాలకు చెందిన వారు జీవిస్తున్నారు. రైల్వేకు ప్రసిద్ధి కావడం.. ఎన్నో పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటుతో వలసలు వచ్చి స్థిర పడిపోయారు. దాంతో రేణిగుంట మినీ భారత్‌గా పేరుగాంచింది.

రేణిగుంట రైల్వేస్టేషన్‌ ముఖద్వారం
రేణిగుంట రైల్వేస్టేషన్‌ ముఖద్వారం
author img

By

Published : Feb 2, 2021, 1:14 PM IST

● 20 రాష్ట్రాల వాసుల స్థిరనివాసం

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

రైల్వేస్టేషన్‌ ముఖద్వారం

తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రేణిగుంట పట్టణ స్థాయిని కలిగి ఉంది. పంచాయతీని 1958లో ఏర్పాటు చేసి తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు. తొలుత ఆరు వార్డులుగా ఉండగా.. నేడు 20కి విస్తరించింది. గ్రామం నుంచి పట్టణ స్థాయికి విస్తరించినా ఇప్పటికీ పంచాయతీగానే ఉండిపోయింది. పారిశ్రామికవాడ, రైల్వే జంక్షన్‌, సీఆర్‌ఎస్‌ ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు.

*వార్డులు 20

*జనాభా: 26,031 (2011 లెక్కల ప్రకారం)

*ఓటర్లు 19,474

చుట్టూ పరిశ్రమలు

సీఆర్‌ఎస్‌, గాజులమండ్యం పారిశ్రామికవాడతోపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుతో ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయి. ఇప్పటికే సెల్‌కాన్‌తోపాటు కార్బన్‌ పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. విమానాశ్రయం ఏర్పాటు సైతం వివిధ ప్రాంతాల వ్యక్తులు ఇక్కడ తమ స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు దోహదపడింది.

రైల్వే ఉద్యోగాలకు వచ్ఛి..

రైల్వేలో ఉద్యోగాలు చేసేందుకు కార్మికులు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోతున్నారు. రైల్వేలో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడ గతంలో ప్రభుత్వం గాజులమండ్యం పరిధిలో పారిశ్రామికవాడను ఏర్పాటు చేసింది. హార్డ్‌వేర్‌ ఇండస్ట్రీ ఇక్కడ నెలవైంది. వీటిలో పనిచేసేందుకు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉండిపోయారు.

*ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఉత్తరాంచల్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ప్రతి మతం వారు ఉన్నారు. అన్నిమతాల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసిమెలసి జీవిస్తున్నారు. అన్ని పండుగలకు కలిసికట్టుగా జరుపుకోవడం ఇక్కడ సంప్రదాయం.

సేవా కార్యక్రమాల్లో...

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేణిగుంట శ్రీజైన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలుమార్లు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించారు. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో అన్నదానం నిర్వహించారు.

వివిధ హోదాల్లో...

రేణిగుంటకు చెందిన పలువురు ఉన్నతస్థాయిలో పనిచేసి పేరుప్రఖ్యాతులు గడించారు. 2003 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రత్నా సుధాకర్‌ ఇదే ప్రాంతం నుంచి వచ్చారు. ప్రస్తుతం తమిళనాడు ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ సంయుక్త డైరెక్టరుగా కొలకలూరి ఝాన్సీరాణి, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి రాజన్‌, విశ్రాంత ఎస్వీ పశువైద్య వర్సిటీ వీసీ హఫీజ్‌ ఇక్కడి వారే. ఆల్‌ ఇండియా రేడియో డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన విల్సన్‌ హేరాల్డ్‌ రేణిగుంటకు చెందిన వారేనని స్థానికులు చెబుతున్నారు. సినీ పరిశ్రమలో గాయకుడు మురళి, ఎడిటర్‌ శంకర్‌ ఇక్కడ జన్మించారు. పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన పురుషోత్తం రేణిగుంటకు చెందిన వారుగా చెబుతున్నారు.

ఇదీ చదవండి

' సారా అమ్ముతాం.. మీరేం చేస్తారు '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.