రాష్ట్రమంతా నైరుతి రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా... చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల్లో వర్షాల జాడ లేదు. దీంతో తంబళ్లపల్లె అక్కమ్మ చెరువులో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు వాన దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిందువులు కప్పలకు పూజలు నిర్వహించారు. ఇంతటి దారణమైన కరువు పరిస్థితులు ఎన్నడూ చూడలేందటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి.. వరుణుడి రాక కోసం... కప్పలకు పెళ్లి