తిరుమల నుంచి కారులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 13 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. బ్రహ్మోత్సవాలను అనుకూలంగా చేసుకొని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్లు. భక్తులులాగా కారులో ప్రయాణిస్తున్న దుండగుల సమాచారాన్ని ముందే తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అలిపిరి వద్ద అరెస్టు చేశారు. ఇటీవల ఇదే వాహనంలో తిరుమలకు 5 సార్లు వచ్చి ఎర్రచందనం రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు.
భక్తులు కాదు... ఎర్రచందనం స్మగ్లర్లు... - Task Force Police Arrested Red Sandalwood Smugglers
భక్తుల ముసుగులో తిరుమలలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న దుండగులను పోలీసులు అరెస్టు చేశారు.
తిరుమల నుంచి కారులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 13 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. బ్రహ్మోత్సవాలను అనుకూలంగా చేసుకొని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్లు. భక్తులులాగా కారులో ప్రయాణిస్తున్న దుండగుల సమాచారాన్ని ముందే తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అలిపిరి వద్ద అరెస్టు చేశారు. ఇటీవల ఇదే వాహనంలో తిరుమలకు 5 సార్లు వచ్చి ఎర్రచందనం రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా మార్చుకొందామన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు పోలీసులు.
తిరుమల నుంచి కారులో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ అలిపిరి టోల్ గేటు వద్ద వాహనం తో పాటు 13 దుంగలు స్వాధీనం చేసుకొని నలుగురు స్మగ్లర్లు అరెస్టు చేశారు.పైన
రెండు టోల్ గేట్లు దాటి యధేచ్చగా అక్రమ రవాణా చేస్తూ కింద టోల్ గేటులో దొరికిపోయారు.ఇటీవల ఇదే వాహనంలో తిరుమల కు 5 సార్లు వచ్చి ఎర్ర చందనం రవాణా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు తమిళ స్మగ్లర్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. తిరుమల నుంచి ఎర్ర చందనం దుంగలు రవాణా చేసేందుకు ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ పోలీసు లు అలిపిరి వద్ద పక్కా సమాచారం తో పట్టుకున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, ఇతరటీమ్ లు శేషాచలం పరిసరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి వచ్చే వాహనాలపై దృష్టి పెట్టారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఒక టాటా సఫారీ వాహనం, పూజలు చేసుకుని వస్తున్నట్లు , వాహనం ముందు భాగాన పూలతో అలంకరించి వస్తూ కనిపించింది. టాస్క్ ఫోర్స్ టీం ఆ వాహనాన్ని అడ్దగించారు. అందులో 13 ఎర్ర చందనం దుంగలు లభించాయి. దుంగలతో పాటు నలుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారు తమిళనాడు ధర్మపురి జిల్లా చిట్టేరి పంచాయతీకి చెందిన మురుగేశన్ జయపాల్ (25), రామలింగం అరుణాచలం (30), భూపాల్ కందస్వామి (27), డ్రైవర్ పెరుమాళ్ వేలు (35) గా గురించారు. TN 07 AL 3903 నెంబరు కల ఈ వాహనం ఇది వరకు ఐదు సార్లు తిరుమల కు వచ్చి ఎర్ర చందనం దుంగలను రవాణా చేసినట్లు విచారణ లో తెలిసింది. ఈ వాహనం తిరుమల నుంచి రెండు టోల్ గేట్లను దాటుకుని వెళుతోంది. దీనిపై నిఘా లేకపోవడం తో అక్రమ రవాణా యదేచ్చగా సాగుతోంది. స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.998555583.