చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో స్థానిక స్మగ్లర్ల అలజడి ఎక్కువైంది. లాక్ డౌన్ కారణంగా తమిళ స్మగ్లర్ల తగ్గడంతో స్థానిక స్మగ్లర్లు ఎక్కువయ్యారు. యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అడవులలో కాటుక కనుమ రోడ్డు, మూతలైను ప్రాంతాలలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేపట్టారు. నిన్న అర్ధరాత్రి సమయంలో 21మంది స్మగ్లర్లు రెండు వాహనాలలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా అడ్డుకున్నారు. పీలేరు మండలం మేళ్ళ చెరువుకు చెందిన ప్రధాన స్మగ్లర్ దేవేంద్రతో పాటు... యర్రావారిపాళ్యంకు చెందిన ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 లక్షల విలువైన 19 ఎర్రచందనం దుంగలను కారు, ట్రక్కుతోపాటుగా 70వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భాకరాపేట అటవీశాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కడసారి చూపు దక్కకుండా చేస్తున్న కరోనా...