చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే ఏకాంతంగా జరిపారు. తితిదే అనుబంధంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని.. ఈ యాగం నిర్వహణతో సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఉదయం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం పుష్పయాగం జరిగింది. ఇందుకోసం దాదాపు 3 టన్నుల పుష్పాలను వినియోగించారు. వీటిని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు.
ఇదీ చూడండి: