ETV Bharat / state

స్విమ్స్​లో జనరిక్ మందుల వాడకంపై ప్రధాని ప్రశంస - తిరుపతి తాజా వార్తలు

తిరుపతి స్విమ్స్ లో జనరిక్ మందుల వాడకంపై ప్రధాని అభినందించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. సామాజిక ఆరోగ్య కేంద్రాలలో.. ఇదే విధానాన్ని అమలు చేయలని సూచించారని వెల్లడించారు.

Prime Minister Modi
స్విమ్స్ లో జనరిక్ మందుల వాడకంపై ప్రధాని ప్రశంస
author img

By

Published : Jan 29, 2021, 11:00 AM IST

తితిదే నిర్వహణలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్( స్విమ్స్)లో జనరిక్ మందుల వాడకాన్ని... ప్రధాని మోదీ అభినందించినట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా జనరిక్ మందుల అమ్మకాలు, వాడకాలను ప్రోత్సాహించే అంశంపై... ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పలు రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ స్విమ్స్ లో జనరిక్ మందుల వాడకం గురించి ప్రధానికి వివరించినట్లు తితిదే తెలిపింది. దీనిపై ప్రధాని.. ప్రశంసించినట్లు వెల్లడించారు . రాష్ట్రంలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయలని సూచించారని తెలిపింది.

ఇదీ చదవండీ.. మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలపై కేసుల ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.