చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, శ్రీరంగారాజపురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. తీవ్రమైన ఎండతో అల్లాడిపోయిన ప్రజానీకం వర్షంతో కాస్త ఊరట చెందారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చిత్తూరు జిల్లాలో వర్షం... సాగుకు అన్నదాత సన్నద్ధం - rain news srirangarajapuram
పక్షం రోజులుగా తీవ్రమైన ఎండలో అల్లాడిన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ప్రజానీకం వర్షం కురవగా కాస్త సేద తీరారు. చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవటంతో సాగుకు ఎదురుచూస్తున్న అన్నదాతలు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం