ETV Bharat / state

చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్​రెడ్డికి పోలీసు మెడల్​

చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్​రెడ్డి ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీసు మెడల్​కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ సెంథిల్​కుమార్, అడిషనల్​ ఎస్పీ మహేష్​ అభినందనలు తెలిపారు.

chittoor dsp eshwar Reddy
chittoor dsp eshwar Reddy
author img

By

Published : Aug 14, 2020, 10:46 PM IST

చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్​రెడ్డి ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీసు మెడల్​కు ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం హోంశాఖ ప్రకటించిన పతకాల్లో విశిష్ట సేవలందించినందుకుగాను ఆయనకు మెడల్​ లభించింది. 1989వ బ్యాచ్​కు చెందిన ఆయన 31 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 45 నగదు బహుమతులు...62 రివార్డులు, 30 ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

2002లో సేవా పతకము, 2009లో ఉత్తమ సేవా పతకము, 2010లో ముఖ్యమంత్రి శౌర్య పతకము, 2011లో రాష్ట్రపతి నుంచి పోలీస్ శౌర్యపతకం పొందారు. 2019 జులై నెల నుంచి చిత్తూరు డీఎస్పీగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఈశ్వర్​రెడ్డికి చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మహేష్ అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి

పంద్రాగస్టుకు మోదీ కీలక ప్రకటన- వ్యాక్సిన్​పైనేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.