ETV Bharat / state

ఆస్తి చూసుకోండని చెబితే.. కాజేసే ప్లాన్ వేశారు! - ఆస్తి చూసుకోమని చెబితే కాజేసే ప్లాన్ వేశారు న్యూస్

కాపలాగా ఉండమంటే.. 3 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేయాలని చూశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి యజమానిపై తిరగబడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పది రోజుల్లో నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

police arrested cheaters in chittoor district

author img

By

Published : Apr 4, 2021, 4:50 PM IST

ఫోర్జరీ డాక్యుమెంట్లుతో రూ.3 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు పథకం పన్నిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని చంద్రగిరి సీఐ రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణంలో ఎంజి బ్రదర్స్ 2004లో సుమారు 19 ఎకరాలలో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. తిరుపతికి చెందిన కొత్తపల్లి జయశ్రీ ఆమె భర్త ప్రతాప్ రెడ్డి 2006లో భూమిని కొనుగోలు చేశారు. తర్వాత ఆ స్థలానికి కాపలాగా బాబా ప్రకృద్దీన్, రమీజ, షరీఫ్ బాషాలను ఉంచారు. అనంతరం జయశ్రీ, ప్రతాప్ రెడ్డి అమెరికాకు వెళ్లిపోయారు.

దీంతో కాపలా ఉన్న వ్యక్తి మరి కొందరితో కలసి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన ఆ భూమిని కాజేసేందుకు పథకం పన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సమాచారం తెలుసుకున్న బాధితులు మార్చి 23వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కాపలాదారులు రాత్రికి రాత్రే పరారయ్యారు. ఇవాళ శ్రీనివాసమంగాపురంలో నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు.

ఇదీ చదవండి: బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 22 మంది జవాన్లు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.